ఇక ప్రాజెక్టులన్నీ టూరిజం కేంద్రాలే: మంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నిటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సమాచార, పర్యాటక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయన హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్కుల ఏర్పాటు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకోసం స్థలాలను ఇప్పటికే సేకరిస్తున్నామన్నారు. గ్రామీణప్రాంతాల్లో కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపాధికూడా లభిస్తుందన్నారు. అనంతరం టూరిజం డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications
