3 నుంచి భారత్లో కండోలిజా రైస్ పర్యటన
న్యూఢిల్లీ : అణు ఒప్పంద ఆమోద ప్రక్రియ వాయిదా పడడంతో 123 ఒప్పందంపై సంతకాలు నిలిచిపోయాయి. అయితే వచ్చేవారం అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ భారత పర్యటన సందర్భంగా ఈ సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా సెనేట్ అణు ఒప్పందానికి ఆమోదం తెలిపిన వెంటనే 123 ఒప్పందంపై సంతకాలు జరుగవచ్చని తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 3న కండోలిజా రైస్ భారత పర్యటనకు విచ్చేయనున్నారు. అయితే అణు ఒప్పంద ఆమోదాన్ని బట్టే తుది పర్యటన ఖరారయ్యే అవకాశమున్నది. గత సంవత్సర కాలం నుంచీ కండోలిజా రైస్ భారత పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే మన్మోహన్, బుష్ భేటీలో 123 ఒప్పందంపై సంతకాలు జరగకపోవడం, ప్రణబ్ అమెరికా పర్యటన నేపథ్యంలో కండోలిజా భారత్ పర్యటన దాదాపు ఖరారైంది.












Click it and Unblock the Notifications
