అణు ఒప్పందంపై సెనేట్ ఓటింగ్ వాయిదా
వాషింగ్టన్: ఆఖరి క్షణంలో అణు ఒప్పందం కీలక మలుపు తిరిగింది. అణు ఒప్పందంపై అమెరికా సెనేట్ ఓటింగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనితో అణు ఒప్పందం కార్యరూపం దాల్చే అరుదైన అవకాశం చేజారింది. అణు ఒప్పందంపై సంతకాలు పూర్తి చేయాలని పట్టుదలగా అమెరికా బయలుదేరిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పరిణామంతో కొ ద్దిగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.
సెనేట్‌లో బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థిక సంక్షోభంపై మధ్యంతర చర్చ మొదలు కావడంతో అణు ఒప్పందంపై ఓటింగ్ ఒక రోజు వాయిదా పడింది. అయితే నేడు వ్యూహాత్మకంగా 40 నిమిషాల పాటు చర్చ కొనసాగించిన విపక్షాలు ఓటింగ్‌పై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. అణు ఒప్పందానికి తాము వ్యతిరేకం కాదంటూనే బుష్ వ్యవహరించిన తీరును, ఒప్పందంలోని లోపాలను సభ్యులు తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications
