కర్నూలులో వైద్యం అందక రోగి మృతి
కర్నూలు: సకాలంలో వైద్యం అందక కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మోటార్ సైకిల్ పై నుంచి పడి ఎల్లప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయమై రక్తం కారడం మొదలైంది. దీంతో ఎల్లప్పను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. తాము సమ్మెలో ఉండడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో ఎల్లప్ప మరణించాడు. ప్రభుత్వ వైద్యుల సమ్మెతో జిల్లావ్యాప్తంగా సాధారణ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications