ఖమ్మంలో రైతులపై పోలీసుల లాఠీచార్జీ
ఖమ్మం: ఖమ్మంలో రైతులపై శుక్రవారం పోలీసుల లాఠీలు కరాళ నృత్యం చేశాయి. ఈ లాఠీచార్జీలో పలువురు రైతులు గాయపడ్డారు. రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. రైతులు శుక్రవారం నాడు ఎరువులు, పురుగు మందుల గోదాములపై దాడులు చేశారు. రైతు సేవా కేంద్రంపై, గ్రోమోర్ ఎరువుల గోదాంపై వారు దాడి చేసి ఎరువుల బస్తాలను ఎత్తుకుపోవడానికి సిద్ధపడ్డారు.
రైతులు వందల సంఖ్యలో రావడంతో అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో పోలీసులు రైతులపై లాఠీచార్జీకి దిగారు. రైతులను తరిమి తరిమి కొట్టారు. ప్రతిగా రైతులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. రైతులు మూడు ఎరువుల లారీలపై దాడి చేసి బస్తాలు ఎత్తుకెళ్లారు.












Click it and Unblock the Notifications