మహాకూటమి కుదరదు కాబట్టే..: నారాయణ
హైదరాబాద్ : తన వ్యూహంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందని, అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేసారు. తాము ముందస్తు ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో విపక్షాల ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పాటు చేయడం అసాధ్యమనీ, అందుకే తాను అధికార పంపకం (పవర్ షేరింగ్) ప్రస్తావన తీసుకు వచ్చానని చెప్పార.
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కలిసి పోటీ చేసి అధికారాన్ని చెరో రెండేళ్ళు పంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. తాను ఈ ప్రస్తావన తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని, కాబట్టి ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని నారాయణ అన్నారు. చింతపల్లి బాక్సైట్ తవ్వకాలపై అభిప్రాయ సేకరణ బూటకమని ఆయన అన్నారు. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా రేపు (శనివారం) బ్లాక్ డేగా పాటించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications