బెల్టు షాపుల వివరాలకు లోక్ సత్తా డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని బెల్టు షాపులను నవంబర్ 5వ తేదీకల్లా మూసివేయాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. వారంలోగా ప్రభుత్వం గుర్తించిన బెల్టుషాపుల వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. బెల్టుషాపులపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని అయితే ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మద్యం విచ్చలవిడి విక్రయాలను నిలిపేవాలన్నది లోక్ సత్తా ప్రధాన డిమాండ్. అయితే చంద్రబాబు నాయుడు హయాంలోనే బెల్టు షాపులు వచ్చాయని, అదే సంప్రదాయం ఇప్పుడు కొనసాగుతోందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పడం విశేషం. ఈ విషయంపై జయప్రకాష్ నారాయణ తన విలువైన సందేశాన్ని అందించవలసిన అవసరముంది.












Click it and Unblock the Notifications