తెలంగాణ సాధించి తీరుతాం: కాకా
హైదరాబాద్ : తెలంగాణను సాధించి తీరుతామని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. తన 85వ జన్మదిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల అనంతరం తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తాను సీనియర్ అయినప్పటికీ తనకు ఎలాంటి పదవులు లభించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాకా జన్మదిన వేడుకలకు పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 2009లోగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, దానికి తానే వ్యవస్థాపకుడినని కాకా అన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తర్వాత తమ పార్టీ అధిష్ఠానవర్గం తెలంగాణపై దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. అవసరమైతే తాను పార్టీ అధిష్ఠానవర్గంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications