ఫైనాన్సియల్ క్రైసిస్ కు బలైన భారతీయ కుటుంబం
లాస్‌ఏంజెల్స్: అమెరికాలో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న ఆర్ధిక పరిణామాల తీవ్రత ఓ భారతీయ కుటుంబాన్ని బలి తీసుకుంది. తాము అనుభవిస్తున్న భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే మరణించామంటూ సుసైడ్ నోట్ పెట్టి మరీ వారు మరణాన్ని ఆహ్వానించారు.
ఓవైపు నిరుద్యోగం... మరోవైపు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కార్తీక్‌రాజారాం అనే 45 ఏళ్ల నిరుద్యోగి తన భార్య, ముగ్గురు పిల్లలు, అత్తగారిని కాల్చిచంపి తానూ కాల్చుకుని చనిపోయాడు. లాస్‌ఏంజెల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయేముందు పోలీసులకు రాసిన ఉత్తరంలో నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల మూలంగా తనకు ఇక రెండే మార్గాలు మిగిలాయని ఒకటి తాను ఆత్మహత్య చేసుకోటం రెండవది కుటుంబంతో సహా మరణించటమని, తనకు రెండవ మార్గమే మేలనిపించి ఈ దారుణానికి పాల్పడుతున్నానని తెలిపాడు.
ఫస్ట్‌ఫ్లోర్‌లో అతని అత్తగారు రామశేషం(69), శవం ఆమె గదిలో మంచంమీద పడిఉండగా, మరో గదిలో కుమారుడు(కృష్ణరాజారాం) శవం పడిఉంది. అప్‌స్టెయిర్స్‌లో భార్య శుభశ్రీ(39) శవం పడి ఉంది. నిద్రలో ఉండగానే ఆమెను కాల్చిచంపినట్లు తెలుస్తోంది. మరో గదిలో ఇద్దరు పిల్లలు గణేష(12), అర్జున(7)ల శవాలు పడిఉండగా అక్కడే నేలపై రాజారాం శవం పడిఉంది. ఎంబీఏ చేసిన రాజారాం ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ కంపెనీలోను, సోనీ పిక్చర్స్‌లోను పనిచేశాడు. అనేక నెలలుగా నిరుద్యోగిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నేవడాలో అతని పేరుమీద ఓ కంపెనీ ఉన్నా లావాదేవాలేమీ జరగలేదు. ఉద్యోగం లేకపోవటం, ఎక్కడా రాకపోవటంతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.సమీపంలోని ఓ కంపెనీలో పనిచేసే ఆయన భార్య విధులకు రాకపోవటంతో వారు ఆరాతీయగా సోమవారం హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications
