ఊసరవెల్లి రాజకీయాలు తెలియవు: చిరు
విజయనగరం: తనకు ఊసరవెల్లి రాజకీయాలు తెలియవని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఆయన ప్రజా అంకిత యాత్ర ఆదివారంనాడు విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఆయన యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల ఆహ్వానం మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. ప్రజనలు ఏలే నాయకులు తమకు వద్దని, మనల్ని మనమే పాలించుకుందామని ఆయన అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర ఉద్యమాలకు పుట్టినిల్లు అని, ఉత్తరాంధ్ర వెనకబడి పోవడానికి పాలకులే కారణమని ఆయన విమర్శిచారు. మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా వెనకబడిపోవడానికి కూడా పాలకులే కారణమని ఆయన అన్నారు. పచ్చని పొలాలను పెద్దలకు సెజ్ ల పేరిట దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపించిన ఈ ఏడాదిలోనే పాలకులు వాగ్దానాలు చేస్తున్నారని, మిగతా నాలుగు సంవత్సరాలు ప్రజలను వదిలేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications