కుటుంబ పాలనకు దూరం : దేవేందర్
హైదరాబాద్ : కుటుంబపాలన, వారసత్వరాజకీయాలకు నవ తెలంగాణ ప్రజాపార్టీ దూరంగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్ అన్నారు. పార్టీ తొలి అడ్‌హక్‌కమీటి సమావేశంలో ఆయన ఆదివారంనాడు మాట్లాడారు. తెలంగాణ సాధనతో పాటు నవ తెలంగాణ నిర్మాణం దిశగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎత్తులు, పొత్తులపై కొన్ని రాజకీయపక్షాలు హడావుడి చేస్తున్నాయని ఆయన తెలుగుదేశంపై విమర్శలు చేశారు. సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం తమ పార్టీ పని చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications