లక్ష్మీపార్వతి, రామకృష్ణ వివాదం
హైదరాబాద్: హైదరాబాదులోని బసవరామ తారకం ట్రస్టు వద్ద ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతికి, ఎన్టీ రామారావు కుమారుడు రామకృష్ణకు మధ్య ఆదివారంనాడు కూడా వివాదం కొనసాగింది. బసవరామ తారకం ట్రస్టు భవనం చుట్టూ ప్రహారిగోడను నిర్మించేందుకు రామకృష్ణ పనులు మొదలు పెట్టారు. ఆ పనులను అడ్డుకునేందుకు లక్ష్మీపార్వతి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రామకృష్ణకు చెందిన దాదాపు 200 మంది, లక్ష్మీపార్వతికి చెందిన వంద మంది అక్కడ ఉన్నారు.
వివాదం కోర్టులో ఉండగా బసరామతారకం ట్రస్టు భవనం వద్ద రామకృష్ణ పనులు చేపట్టడం సరి కాదని లక్ష్మీపార్వతి అన్నారు. ఇది సివిల్ వివాదమని, ఇందులో పోలీసులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని ఆమె అన్నారు. కోర్టు అనుమతి ఉందని రామకృష్ణ చెప్పే మాటల్లో నిజం లేదని, అది నిజమే అయితే కోర్టు పత్రాలు ఎందుకు చూపడం లేదని ఆమె అన్నారు. బసరామతారకం ట్రస్టు వద్ద శనివారం ఆమె ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications