భైంసా అల్లర్లపై సిబిఐ దర్యాప్తు: జానా
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా అల్లర్లపై, వట్టోలి సజీవదహనంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. భైంసాలో ఆయన ఆదివారంనాడు పర్యటించి పరిస్థితిని పరిశీలంచారు. భైంసా అల్లర్లకు కారణమైనవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. విచారణ అనంతరం దోషులుగా తేలినవారిపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
భైంసా అల్లర్ల విషయంలో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. కులమతాలకు అతీతంగా వ్యవరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంయమనం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. శాంతి పునరుద్ధరణకు సహకరించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను, మత పెద్దలను కోరారు. సిబిఐ దర్యాప్తు విషయమై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ హోంమంత్రి జానారెడ్డితో వాగ్వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications