చిరుకు అధికారమే పరమావధి: జెపి
విశాఖపట్నం: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై మొదటిసారి లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆదివారం విమర్శలు కురిపించారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చిరంజీవి సిద్ధపడుతున్నారని ఆయన విమర్శించారు. డబ్బులు కుమ్మరించకుండా ఎన్నికల్లో పోటీ చేయగలమని చిరంజీవి చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు. డబ్బులు కుమ్మరించకుండా పోటీ చేస్తారా అని అడిగితే తామంతా పిచ్చివాళ్లమా అని చిరంజీవి అన్నారని ఆయన చెప్పారు.
అధికారమే పరమావధిగా చిరంజీవి రాజకీయాలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిపరులను, నేరస్థులను చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. వలసలను ప్రోత్సహించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. విషఫలాల నుంచి అమృత ఫలాలు వస్తాయా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications