కాంగ్రెసును గెలిపించండి: కృష్ణ పిలుపు
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సూపర్ స్టార్ కృష్ణ తన అభిమానులకు పిలుపునిచ్చారు. కృష్ణ- మహేశ్‌సేన సభ్యత్వనమోదును సినీనటుడు కృష్ణ ఆదివారంనాడు హైదరాబాదులోని పద్మాలయా స్టూడియోలో ప్రారంభించారు. మొదటి సభ్యత్వాన్ని కృష్ణ, మహేష్ అభిమాన సేన అధ్యక్షుడు దిడ్డి రాంబాబుకు ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడేకార్యక్రమాలను చేపట్టాలని కృష్ణ అభిమానులను కోరారు. తిరిగి వైయస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరిగి వైయస్ ముఖ్యమంత్రి అయితే జలయజ్ఞం పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని ఆయన చెప్పారు.
అంతకు ముందు ఆయన సతీమణి, సినీ దర్శకురాలు విజయనిర్మల మాట్లాడారు. కాంగ్రెస్ పాలన సుభిక్షంగా ఉందన్నారు. మొత్తం 50 లక్షల మందిని సభ్యులుగా చేర్పించనున్నారు. ఇందుకు గాను కృష్ణ, మహేష్ సేన గౌరవాధ్యక్షుడు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు జిల్లాల్లో ఈ నెల 20వ తేదీనుంచి పర్యటిస్తారు. ఖమ్మం నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభిస్తారు. తాము గత 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాంబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications