ప్రాణాలకు తెగించాం: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తమ ప్రాణాలకు ముప్పు ఉన్నా తాము రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు సాగుతున్నామని ప్రముఖ సినీనటుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాసేవలో తాము ప్రాణాలు కోల్పోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. పార్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. ఇప్పటి వరకు తాము ఇతరుల నుంచి ఒక్క పైసా తీసుకోలేదని ఆయన అన్నారు. ఆస్తులు పెంచుకోవడమే ధ్యేయంగా నేటి రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. సమాజంలో ఘోరాలు, అన్యాయాలు జరుగుతున్నాయని, వాటిని ఉద్యమ స్ఫూర్తితో ఎదిరించే నాయకుడు లేడని ఆయన అన్నారు.
తమకు న్యాయం చేసే నాయకులు లేకపోవడంతో ప్రజా కళాకారుడైన చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకున్నారని, వారి కోరికను మన్నించి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన అన్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ తర్వాత మళ్లీ అటువంటి నాయకుడు చిరంజీవేనని ఆయన అన్నారు. రాజకీయాలు తమకు పవిత్రమైన కార్యమని, ప్రజల జీవిత గమ్యాన్ని మారుస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications