ఉండవల్లికి రామోజీ లీగల్ నోటీసు
హైదరాబాద్: మార్గదర్శిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లీగల్ నోటీసు ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు మార్గదర్శి పరువు తీసేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన ఈ లీగల్ నోటీసు ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే క్రిమినల్ చర్యలకు దిగుతామని ఆయన అన్నారు.
రామోజీరావుపై న్యాయపోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తిరుపతిలో చెప్పారు. తాను వాస్తవాలను బయట పెట్టడం వల్లనే రామోజీరావు ఫైనాన్స్ కంపెనీని మూసివేశారని ఆయన అన్నారు. మార్గదర్శి విషయంలో తన న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications