నేత కార్మికులకు వైయస్ భరోసా
కరీంనగర్: నేత కార్మికులు అధైర్యపడవద్దని, తాము అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారంనాడు పరామర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన నేత కార్మికులను ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు లక్షన్నర రూపాయలేసి నష్ట పరిహారం ఇస్తామని ఆయన చెప్పారు.
చేనేత కార్మికులకు పావలా వడ్డీతో రుణాలను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కిలోకు రెండు రూపాయల చొప్పున 35 కిలోల బియ్యాన్ని ఇస్తామన్నారు. చేనేత కుటుంబాలకు అంత్యోదయ కార్డులను మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. నేత కార్మికులందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications