బిగ్ బాస్ లో అశ్లీలం : నిర్మాతకు సమన్లు
ముంబయి: బిగ్ బాస్ రియాల్టీ షో 2 నిర్మాతకు, బ్రాడ్ కాస్టర్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు. చానెల్ పై, ఆ షోలో పాల్గొంటున్ననలుగురిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆ సమన్లు జారీ చేశారు. ఈ రియాల్టీ షో ఆశ్లీలాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకుడొకరు ఫిర్యాదు చేశారు. పాయల్ రొహతోగి, సంభావనా సేథ్, రాజా చౌదరి, రాహుల్ మహాజన్ లపై ఆయన ఫిర్యాదు చేశారు. వీరు నలుగురు అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అసభ్య పదజాలం వాడుతున్నారని అతను ఆరోపించాడు.
ప్రొడక్షన్ హౌస్ ఎండ్ మోల్, చానెల్ కలర్ పై పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. షో రికార్డింగులు చూపాలని పోలీసులు ఆదేశించారు. వాటిని పరిశీలించిన పోలీసులు ఫిర్యాదులో వాస్తవం ఉందనే నిర్ధారణకు వచ్చారు. పోలీసులు శనివారం ఫిర్యాదును నమోదు చేసుకుని వాంగ్మూలం ఇవ్వాలని చానెల్ కు, ప్రొడక్షన్ హౌస్ కు సమ్మన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications