విజయనగరం: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో, వట్టోలి గ్రామంలో జరిగిన సంఘటనలపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలో ఇరు వర్గాల దాడిలో ముగ్గురు మరణించగా, వట్టోలీలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వట్టోలి గ్రామంలో జరిగిన సజీవ దహనాన్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విషాదకరమైన సంఘటనగా అభివర్ణించారు.
వట్టోలి గ్రామం ఘటనలో ముగ్గురు చిన్నారులు కూడా మరణించడం మనసును కలత పెట్టిందని ఆయన అన్నారు. అల్లర్లను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలియజేశారు.