పొత్తులను ఇప్పుడే తేల్చలేం: చిరు

తాను మనిషినేనని, తనకు కూడా ఆవేశకావేషాలుంటాయని, కొన్ని చోట్ల తాను ఉద్వేగపూరితంగా మాట్లాడానని ఆయన చెప్పారు. తనకు నటుడిగా లభించిన ఆదరణ వేరు, రాజకీయ నాయకుడిగా లభించిన ఆదరణ వేరు అని ఆయన అన్నారు. ప్రతి గ్రామం గంగదేవిపల్లి గ్రామం కావాలని ఆయన అన్నారు. నిఘా వైఫల్యం వల్లనే ఆదిలాబాద్ జిల్లా వట్టోలి గ్రామంలో సజీవ దహనం సంఘటన జరిగిందని ఆయన అన్నారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను బట్టే తన విధానాలుంటాయని ఆయన అన్నారు. సభలకు వచ్చిన వారంతా ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేస్తారో లేదో కాలమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications