పథకం ప్రకారమే వటోలీ దహనం: డిజిపి
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా వటోలీ గ్రామంలో జరిగిన ఘటన పథకం ప్రకారం చేసిందేనని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఎస్.పి. యాదవ్ అన్నారు. వటోలీ గ్రామంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఇది ముమ్మాటికీ హత్యేనని, ప్రమాదవశాత్తు జరిగింది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
వటోలీ ఘటనలో బయటి శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. హత్యకు పాల్పడింది బయటి వ్యక్తులా, గ్రామంలోని వ్యక్తులా అనే దిశలో విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. భైంసాలో పగటి పూట కర్ఫ్యూ ఎత్తేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications