భైంసాలో పగటి కర్ఫ్యూ ఎత్తివేత
ఆదిలాబాద్: ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో మంగళవారం పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత తిరిగి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. భైంసాలో దుర్గాదేవి నిమజ్జనోత్సవం కార్యక్రమం సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. అదే విధంగా భైంసాకు సమీపంలోని వటోలీ గ్రామంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. భైంసా పట్టణవాసులకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తారు.
మైనారిటీ కమీషన్ నిజ నిర్ధారణ బృందం మంగళవారం భైంసా, వటోలీల్లో పర్యటించనుంది. వటోలీ సజీవ దహనం ఘటన ప్రమాదం కాదని, పథకం ప్రకారమే దుండగులు ఈ ఘటనకు పాల్పపడ్డారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఎస్.పి. యాదవ్ సోమవారం చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications