చిరంజీవి పార్టీపై చంద్రబాబు మండిపాటు

Chandrababu Naidu
హైదరాబాద్: తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజారాజ్యం పార్టీ వలసలను ప్రోత్సహించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు. తమ పార్టీ నుంచి చెల్లని కాసులే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లాయని, నీతి లేకుండా పార్టీ నుంచి వెళ్లిన వారిని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని, కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని పని చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారిపై ప్రజారాజ్యం పార్టీ నిఘా వేయడం దారుణమని, అంత నమ్మకం లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎందుకు చేర్చుకున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

యువగర్జన సదస్సుతో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుందని ఆయన అన్నారు. వచ్చేనెల 5వ తేదీన జరిగే యువగర్జన సదస్సును కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో ప్రోత్సాహం నింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెసుకు కూడా ఏం చేయాలో తెలియడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు అధిష్ఠానవర్గం రెండు సార్లు పిలిపించిందని ఆయన చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+