గోదావరిఖని: తాము విప్లవాత్మకమైన, గొప్ప విధానాలు ఏవీ ప్రకటించటంలేదని పలువురు భావిస్తున్నారని అయితే చిరు మార్పులే పెనుమార్పునకు దారి తీస్తాయని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. మలివిడత రాజకీయ పర్యటనలో భాగంగా ఆయన శనివారం గోదావరిఖని చేరుకున్నారు. అక్కడ రోడ్‌షోలో మాట్లాడుతూ సింగరేణి ఆధునికీకరణలో భాగంగా పలువురు ఉద్యోగాలు కోల్పోవటం తనకు ఎంతో ఆవేదన కలిగించిందని అన్నారు. ఆధునికత అంటే మానవశక్తిని నిర్వీర్యం చేయటం కాదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరినీ ఉద్యోగాలనుంచి తీసివేయమని అన్నారు.