పసిడి ధరల్లో భారీ డౌన్ ఫాల్: ముందస్తు కొనుగోళ్లు చేయాలనుకునే వారికి సువర్ణావకాశం

దేశంలో పసిడి ప్రియులు, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం లభించింది. నేడు దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ట్రెండ్స్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ ఆధారంగా ఈ ధరల్లో సవరణ చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు క్షీణించడం వల్ల రాబోయే పండుగలు, వివాహాల సీజన్ కోసం ముందస్తు కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం.

నేటి మార్కెట్ వివరాల ప్రకారం.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,360 మేర తగ్గింది. రూ.1,45,260 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఒక గ్రాము బంగారం ధర రూ.14,526 వద్ద నమోదు అయింది. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 1.3 శాతం మేర తగ్గుదల కనిపించింది. సాధారణంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,250 తగ్గి రూ.1,33,150 కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,08,940 గా నమోదైంది.

Gold and Silver Prices Head Lower on Tuesday 24K 22K and 18K beyond easing geopolitical tensions

ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి బంగారాన్ని సేఫ్ హెవెన్ గా భావిస్తారు పెట్టుబడిదారులు. ఇందులో పెట్టుబడి పెడితే నష్టం రాదనే అభిప్రాయం వారిలో బలంగా ఉండటమే దీనికి కారణం. మధ్యతరగతి కుటుంబాల నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ప్రతి ఒక్కరూ రోజువారీ ధరల మార్పులను నిశితంగా పరిశీలిస్తుంటారు. ప్రస్తుత తగ్గుదల కొనుగోలుదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఎల్లప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,618, 22 క్యారెట్లు - రూ. 13,400, 18 క్యారెట్లు - రూ. 11,200

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,526, 22 క్యారెట్లు- రూ. 13,315, 18 క్యారెట్లు - రూ. 10,894

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,526, 22 క్యారెట్లు- రూ. 13,315, 18 క్యారెట్లు - రూ. 10,894

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,526, 22 క్యారెట్లు- రూ. 13,315, 18 క్యారెట్లు - రూ. 10,894

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,526, 22 క్యారెట్లు- రూ. 13,315, 18 క్యారెట్లు - రూ. 10,894

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,526, 22 క్యారెట్లు- రూ. 13,315, 18 క్యారెట్లు - రూ. 10,894

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+