విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్!

హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా అన్ని రంగాలలో దూకుడు చూపిస్తోంది. ఇదే క్రమంలో అంతర్జాతీయ ఉన్నత విద్యారంగానికి కూడా హైదరాబాద్ వేదిక కాబోతుంది. అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుతో ఇప్పటికే విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి అనేక దేశాలు హైదరాబాద్ కు క్యూ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఉన్నత విద్యారంగానికి హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారబోతుంది.

ఫారెన్ యూనివర్సిటీలు క్యాంపస్ ల ఏర్పాటు

మన దేశం నుండి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ప్రతీ సంవత్సరం వేలాదిమంది విద్యార్థులు విదేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్తున్నారు. అటువంటి వారి కోసం అంతర్జాతీయ ఉన్నత విద్య ఇక్కడే అందుబాటులో ఉండేలా ఫారెన్ యూనివర్సిటీలు క్యాంపస్ లను ఏర్పాటు చేయనున్నాయి. కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020తో పాటు, యూజీసీ ప్రకటించిన నూతన సడలింపులు భారతదేశంలో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని మరింత ఈజీ చేశాయి .

సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో క్యాంపస్ లు

ఈ అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ వివిధ దేశాలకు చెందిన సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉన్న మంచి మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, నివాసయోగ్యమైన వాతావరణం ఉండడం అంతర్జాతీయ సంస్థలను ఇటువైపు ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది.

Hyderabad Global Education Hub international universities Around 15 setting up their campuses

అమెరికా, యూకే నుండి ప్రముఖ వర్సిటీల క్యాంపస్ లు

ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూకేకు చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ క్యాంపస్‌ల ఏర్పాటు కోసం యూజీసీకి అధికారికంగా దరఖాస్తులు చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ విశ్వవిద్యాలయాలన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే స్వతంత్ర ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వర్సిటీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే హైదరాబాద్ లో క్లాసులు ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన

ఇందుకోసం ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని ఒక భారీ కమర్షియల్ టవర్‌లో కొన్ని అంతస్తులను లీజుకు తీసుకునేందుకు ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరుపుతోంది. అయితే వీటికి సంబంధించి తాత్కాలికంగా ఇక్కడ ప్రారంభించి భవిష్యత్తులో ప్రయోగశాలలు, స్పోర్ట్స్ అకాడమీలతో కూడిన శాశ్వత క్యాంపస్‌ల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

క్యాంపస్ ల ఏర్పాటుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు

మనదేశంలో ఇతర దేశాలకు సంబంధించిన మరికొన్ని టాప్ యూనివర్సిటీలు క్యాంపస్ లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రాథమిక సంప్రదింపులు పూర్తి చేశారు. అలాగే యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రత్యేకంగా క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన స్పెషలైజ్డ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక!
ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక!

హైదరాబాద్ కు రానున్న ఈ యూనివర్సిటీలు

వీటితో పాటు న్యూజిలాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వైకాటో, యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్, న్యూ కాజిల్ యూనివర్సిటీ, చిచెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధులు కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి ఇక్కడ క్యాంపస్ లను ఏర్పాటు చేయటానికి తమ ప్రతిపాదనలను చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+