తమిళ సినీతారల నిరాహార దీక్ష

వేళచ్చేరి: శ్రీలంక తమిళులకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ శనివారం నిరాహార దీక్ష చేపట్టింది. ఈదీక్షలు అగ్రతారాగణం పాల్గొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. మరోవైపు దక్షిణ భారత చలన చిత్ర నటుల సంఘం తరపున జరగబోయే ఈ నిరాహార దీక్షలో ఏ ఒక్కరు కూడా చట్టాన్ని ఉల్లంఘించే వ్యాఖ్యలు చేయరాదని సంఘం అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ ఆదేశించారు.

శ్రీలంక తమిళులకు మద్దతుగా కోలీవుడ్‌ నటీనటులు శనివారం చెన్నయ్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరాహారదీక్ష చేపట్టారు. నడిగర్‌ సంఘం కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అజిత్‌, విజయ్‌, విక్రమ్‌, సూర్య, ధనుష్‌, శింబు, జయం రవి, ఆర్య, ప్రకాష్‌రాజ్‌, శ్యామ్‌ తదితర అగ్రనటులు రాధిక, నయనతార, త్రిష, స్నేహ, నమిత తదితర నటీమణులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ దీక్షలు మధ్యాహ్నం పాల్గొననున్నారు. నటీనటులంతా దీక్షలో పాల్గొంటున్న కారణంగా శనివారం సినిమా షూటింగ్‌లను రద్దు చేశారు.

దీక్ష ముగింపు సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతుగా కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచనున్నారు. ఈ మేరకు నెరవేర్చే తీర్మానాల నకలును ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ముఖ్యమంత్రి కరుణానిధిలకు పంపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+