బస్సు ప్రమాదంలో 15 మంది మృతి
ముంబై: బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. మహరాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఘూంస్ ఘాట్ సమీపంలో మలుపు తిరుగుతుండగా బస్సు లోయలో పడిపోవడంతో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications