హైదరాబాద్: 4న నీటి సరఫరా బంద్
హైదరాబాద్: జంట నగరాలకు నీటి గండం పొంచి ఉంది. ఈ నెల 4న కృష్ణా ప్రాజెక్టు మొదటిదశ, రెండోదశ పంపింగ్ స్టేషన్లలో ఎలక్ట్రికల్ పనులు, రింగ్‌మెయిన్-1, కృష్ణాఫేజ్-2 ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు కొనసాగుతున్న కారణంగా మంగళవారం జంట నగరాల్లోని సగానికి సగంపైగా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని మెట్రో వాటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు. మరమ్మతుల కారణంగా కృష్ణా ప్రాజెక్టు నుంచి రోజూ తరలించే 180 ఎంజీడీల నీటి సరఫరాకు ఆటంకం ఉంటుందని అన్నారు. దీంతో జంట నగరాలకు సరఫరా చేసే రిజర్వాయర్లకు నీటి సరఫరా ఉండదని అన్నారు.
ఈ కారణంగా నగరంలోని కృష్ణా మొదటిదశ పరిధిలోకి వచ్చే మహబూబ్‌మాన్షన్, నారాయణగూడ, బొగ్గుల కుంట, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, మేకలమండి, సీతాఫల్‌మండి, వైశాలినగర్, వినయ్‌నగర్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, సంతోష్‌నగర్, అలియాబాద్ రిజర్వాయర్, మీరాలం పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.
అలాగే కృష్ణా రెండోదశ పరిధిలోకి వచ్చే సాహెబ్‌నగర్, ఆటోనగర్ రిజర్వాయర్ ఏరియాలు, వాసవి నగర్, డివిజన్-10 పరిధిలోని అన్ని ప్రాంతాలు, ఎల్‌బీ నగర్, ఉప్పల్ మున్సిపల్ ఏరియా, బాలాపూర్ రిజర్వాయర్ ఏరియా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ మున్సిపాలిటీ, ప్రశాసన్‌నగర్, భోజగుట్ట,షేక్ పేట తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు.












Click it and Unblock the Notifications