న్యూఢిల్లీ: దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ శనివారం అసోంలో పర్యటించనున్నారు. గురువారం గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రధాని పరామర్శిస్తారు. తర్వాత అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్, గవర్నర్‌లను కలిసి సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటారు. మన్మోహన్ రాక సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు అసోంలో వీహెచ్‌పీ 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చింది.