రాష్ట్ర అవతరణ: తెలంగాణలో నిరసన
హైదరాబాద్: తెలంగాణా జిల్లాల్లో ఆంధ్రరాష్ట్ర అవతరణ ఉత్సవాలను తెరాస ఎమ్మెల్యేలు, నేతలు అడ్డుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పెరేడ్‌గ్రౌండ్స్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేలు హరీష్‌రావు, రామలింగారెడ్డిలను, కరీంనగర్‌లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్‌లలో మంత్రులను ఘెరావ్ చేసిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డిలో కలెక్టరేట్‌పై నల్లజెండాలను ఎగురవేయటంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.












Click it and Unblock the Notifications