ఉపాధ్యాయుల సమ్మె మరింత ఉదృతం
హైదరాబాద్ : డిమాండ్ల సాధనకై ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మె మరింత ఉదృత రూపం దాల్చింది. ఉపాధ్యాయులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు కూడా సామూహికంగా నిరాహార దీక్షలలో పాల్గొని తమ నిరసన తెలియజేస్తున్నారు. మరోపక్క కొన్ని జిల్లాలలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
డిమాండ్ల సాధనకై ఉపాధ్యాయులు అమాత్యులను అడ్డగించి నిలదీస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరులో చెంగారెడ్డిని ఘెరావ్ చేసి తమ డిమాండ్ల సాధనకై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టా రు. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి తాను వైఎస్‌తో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో ఆయనను వదిలిపెట్టారు. అయితే ఆర్థిక డిమాండ్లపై వైఎస్ తన వైఖరి మార్చుకున్నట్లు లేదు.












Click it and Unblock the Notifications