న్యూయార్క్: యాపిల్ కంపెనీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐపాడ్‌ను ప్రవేశపెట్టి ఐపాడ్ పితామహుడిగా పేరు పొందిన టోనీ ఫెడెల్ కంపెనీని వీడనున్నారు. ఈ ఏడాది చివరలో ఆయన రాజీనామా చేస్తారు. ఆయనతో పాటు ఆయన భార్య, కంపెనీ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ ఉపాధ్యక్షురాలు డేనియెల్లి లాంబెర్ట్ కూడా రాజీనామా చేస్తున్నారు. విధుల ఒత్తిడితో తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్లు వారు కంపెనీ యాజమాన్యానికి పంపిన లేఖలో తెలిపారు. వారు తమ సంస్థను వీడటం విచారకరమని అయితే ఆ తరువాతకూడా వారు తమకు సలహాదారులుగా కొనసాగుతారని యాజమాన్యం తెలిపింది.