ఒకే వేదికపై విజయ్, త్రిష, జగన్, కేటీఆర్.. రిసెప్షన్లో ఆసక్తికర పరిణామం!
కోలీవుడ్ హిట్ జంట, తమిళనాడు సీఎం సి.జోసెఫె విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మళ్లీ ఒక్కటిగా ఒకే వేదికపై మెరవడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ, అటు దక్షిణాది సినీ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం సాయంత్రం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఓ వివాహా రిసెప్షన్ కార్యక్రమంలో విజయ్, త్రిష ఒకేసారీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వేదికపై జోడీగా మెరిసి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రాజకీయ, సినీ దిగ్గజాల సమక్షంలో గ్రాండ్ ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు(వైఎస్ అనిల్ రెడ్డి) కూతురు శ్రేయ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్, నటి త్రిషతో పాటు తన తల్లి శోభ చంద్రశేఖర్‌తో కలిసి వేదిక ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఒకే ఫ్రేమ్‌లో విజయ్, ఆయన తల్లి, త్రిష ఉన్న వీడియోలు చూస్తుండగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వేదికపైకి చేరుకున్న అనంతరం నవదంపతులకు విజయ్-త్రిష జంట పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ బ్రౌన్ రంగు ఫార్మల్ సూట్లో క్లాసీ లుక్‌లో కనిపించగా.. త్రిష పింక్ కలర్ డిజైనర్ చీరలో ఎంతో అందంగా మెరిసిపోయారు.
CM Vijay, accompanied by the ever gorgeous Trisha, attended the family function of YS Jagan Mohan Reddy. #TVKVijay #TrishaKrishnan @TVKVijayHQ @trishtrashers https://t.co/EOj55f2qor
— Harish M (@chnmharish) November 5, 2026

వైఎస్ జగన్-విజయ్ ఆత్మీయ కలయిక
ఈ రిసెప్షన్ వేడుకలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌తో విజయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకోవడమే కాకుండా.. వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మలతో కలిసి ఫోటోలకు ఉత్సాహంగా ఫోజులిచ్చారు. ఈ భేటీ రాజకీయ విశ్లేషకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కావడం గమనార్హం. కేటీఆర్ కూడా సీఎం విజయ్ను ఆప్యాయంగా పలకరించారు.
Tamilnadu Chief Minister #JosephVijay and #Trisha attended YS Anil reddy's Daughter Wedding Reception at Chennai Today ❤️ @trishtrashers @actorvijay https://t.co/roJuihQG2a
— Trisha Krishnan Universe (@aruntrish) November 5, 2026
ముదిరిన పుకార్లు
విజయ్, త్రిషల మధ్య అనుబంధంపై గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చెన్నైలో జరిగిన నిర్మాత కల్పాతి ఎస్.సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్లో కూడా వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. సెప్టెంబర్‌లో బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో నటుడు అజిత్ కుమార్ రేస్ కార్యక్రమంలో కూడా వీరిద్దరూ ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటీషన్ దాఖలు చేశారన్న వార్తలు వచ్చిన సమయం నుంచి త్రిష-విజయ్‌ల అనుబంధంపై ప్రచారం మరీ ఎక్కువైంది. ఆ తర్వాత సంగీత తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నప్పటికీ.. సదరు ప్రచారాలకు మాత్రం చెక్ పడలేదు. ఈ ప్రచారాలపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోవడం గమనార్హం.
SOUTHQUEEN @trishtrashers ♥️& CHIEF MINISTER OF TAMILNADU #Vijay 🔥 attended the wedding of Anil Reddy’s daughter in Chennai ❤️🔥💥#trishakrishnan #Trisha #trishaforever #southqueentrisha #cmvijay #JosephVijay https://t.co/L0ZnBPTHLG
— Trisha😻Sushma (@Trishkrish_583) November 6, 2026












Click it and Unblock the Notifications
