మోడీ ఇంట్లో క్రికెటర్ సూర్య కుమార్ ధంతెరాస్- కూతురు పాటకు ప్రధాని చప్పట్లు..!

భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్, ఆ తర్వాత జట్టుకు అనూహ్యంగా దూరమైన టీమిండియా మాజీ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇవాళ ప్రధాని మోడీని కలిశారు. ధంతెరాస్ సందర్భంగా ప్రధాని మోడీని సూర్య కుటుంబంతో సహా వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సూర్య, ఆయన భార్య, పిల్లల్ని పలకరించి ఆహ్లాదంగా గడిపారు. ఈ వీడియో రీల్ ను ప్రధాని మోడీ స్వయంగా షేర్ చేశారు. దీంతో మోడీ-సూర్య భేటీ వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.

IPL 2027: CSK, SRH మధ్య డీల్ ఖరారు- నలుగురు స్టార్లకు స్దానచలనం..!
IPL 2027: CSK, SRH మధ్య డీల్ ఖరారు- నలుగురు స్టార్లకు స్దానచలనం..!

టీమిండియాకు దూరమైన తర్వాత ఎక్కువగా బయట కనిపించని సూర్య కుమార్ యాదవ్ ఇవాళ హఠాత్తుగా ప్రధాని మోడీని కుటుంబంతో సహా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్యకుమార్ యాదవ్ తో పాటు వచ్చిన తన పిల్లలతోనూ మోడీ చక్కగా సంభాషిస్తూ కనిపించారు. అలాగే సూర్య కూతురు పాత పాడుతుంటే, దానికి మురిసిపోతూ ప్రధాని చప్పట్లు కొడుతున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.

Suryakumar Yadav Meets PM Modi with Family on Dhanteras PM Shares Special Reel

కాక్రోచ్ నేతలకు అమెరికా నిధులు, పాకిస్తాన్ సంబంధాలు- కేంద్రం సంచలన ఆరోపణలు..!
కాక్రోచ్ నేతలకు అమెరికా నిధులు, పాకిస్తాన్ సంబంధాలు- కేంద్రం సంచలన ఆరోపణలు..!

గతంలో టీమిండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించిన చరిత్ర సూర్యకుమార్ యాదవ్ కు ఉంది. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే సూర్యకుమార్ లేనిదే ఒకప్పుడు టీమిండియా ఆడే టీ20 మ్యాచ్ ను ఊహించుకోవడం కష్టంగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ ఏడాది టీీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ ను విజయ పథాన నడిపించిన సూర్య కుమార్ కు ఆ తర్వాత మాత్రం కష్టాలు మొదలయ్యాయి. టీ20 వరల్డ్ కప్ లోనే ఫామ్ కోల్పోయిన సూర్య.. ఆ తర్వాత ఐపీఎల్ లోనూ వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. దీంతో సూర్యను టీ20 జట్టు కెప్టెన్ గా తప్పించి శ్రేయస్ అయ్యర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచీ సూర్య పేరు వినిపించడమే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఇంటికి వచ్చి మరీ కలిసిన సూర్య కుమార్ మళ్లీ జట్టులోకి వస్తాడా అన్న చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+