ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆపై గోనెసంచిలో మూట కట్టి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం తండాలో ఓ దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం గొల్ల బుద్ధారంకు చెందిన చందుకు 2014లో పావనితో వివాహం జరిగింది. ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా పావనికి అదే గ్రామానికి చెందిన దరావత్ సంతోష్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి చందు పలుమార్లు గొడవలు పడ్డాడు. భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవారు. దీంతో భర్త తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన పావని, సంతోష్ ఇద్దరూ ఆయన్నుఅడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

wife killed husband Shocking Crime in Bhupalpally Wife and Lover Murder Husband Over Extramarital Affair

గురువారం రాత్రి పావని సంతోష్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి చందుపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సమీప గ్రామం దగ్గర రోడ్డు వద్ద పడేశారు. ఉదయం అటుగా వస్తున్న ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి రూరల్ పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో పావని, సంతోష్‌ల ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో ఇలాంటి వివాహేతర సంబంధాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో ఇటువంటి కేసులు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భర్తలు, కొన్నిసార్లు భార్యలు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలకు దిగుతున్నారు.

పాతబస్తీ దీపావళి సందడి: చార్మినార్ దారుల్లో ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
పాతబస్తీ దీపావళి సందడి: చార్మినార్ దారుల్లో ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

పోలీసులు ఇలాంటి కేసులను త్వరగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నా, సమాజంలో నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి భర్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారని భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్ రావు చెప్పారు. మృతదేహాన్ని గోనెసంచిలో మూట కట్టి రోడ్డు పక్కన పడేశారని, ఇద్దరినీ అరెస్ట్ చేశామని అన్నారు. మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగుతోంది అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+