చెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఈసారి తాను బర్త్ డే ఉత్సవాలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాడు. శ్రీలంకలో తమిళులకు రక్షణ కొరవడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమిళలకు రక్షణ లేకపోవడంపై ఆవేదన చెందుతూ రేపు (శుక్రవారం) తాను బర్త్ డే ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
తమిళుల రక్షణ కోసం తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని ఆయన తన అభిమానులకు పిలుపునిచ్చారు. తమిళుల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన కోరారు. తమిళ ప్రభుత్వ సైన్యాలకు, ఎల్టీటిఇకి మధ్య శ్రీలంకలో తమిళులు నలిగిపోతున్నారని ఆయన అన్నారు.