మీరట్ మృతులు ఆరుగురు..
లక్నో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో శనివారం సాయింత్రం బాంబు ప్రేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఆరుగురు మృతి చెందగా,పది మంది తీవ్రంగా గాయపడినట్లు ఫ్రాధమిక సమాచారం. జకీర్ నగర్ లోని బెంగాళ్ బస్తీలో ఈ ప్రేలుడు సంభవించింది. డైనమేట్లు స్టిక్స్ ప్రేలటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా వరస బాంబు ప్రేలుళ్ళు చోటు చేసుకోవటంతో అంతటా తాజా ప్రేలుళ్లపై ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications