విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ మరోసారి అరెస్టయ్యారు.ఆయన సోదరుడు డేవిడ్ రాజుతో ఏర్పడిన ఆస్థి వివాదంలో ఘర్షణ చెలరేగటంతో వివాదం ముదిరి పోలీసులు రంగ ప్రవేశానికి దారి తీసింది. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న గమ్ సిటీ ఆడిటోరియం ఆస్థి తనదేనంటూ పాల్ తన అనుచరులతో లోనకు ప్రవేశించే యత్నం చేయగా సోదరుడు డేవిడ్‌రాజు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ జరిగింది. డేవిడ్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు ఆయనను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.