మాలెగాం పేలుళ్లలో మరికొందరు ఆర్మీ అధికారులు
న్యూఢిల్లీ: మాలెగాం పేలుళ్లలో రోజుకో విషయం బయటపడి సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఆర్మీ అధికారులకు సంబంధం ఉందన్న విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇందులో మరికొందరు ఆర్మీ అధికారులకు సంబంధం ఉందంటూ మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ బయటపెట్టటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోని అన్నారు. ఇంటిలిజెన్స్ బ్యూరో దీన్ని పరిశీలిస్తోందని ఆయన అన్నారు. దీనిపై నివేదికకోసం ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారులు దీనిపై ఇద్దరు కల్నల్స్, ఓ ఆర్మీ మేజర్‌ను ప్రశ్నించేందుకు ఇప్పటికే అనుమతి కోరారు. పూనె, పర్బని, నాసిక్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్‌లలోని ఆర్మీ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications