చికాగో: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మాద్యం సమస్యపై మొదటగా దృష్టి పెట్టారు. ఆ దిశలో ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఆయన నడుంకట్టారు. ఈ ఎకనామిక్ క్రైసెస్‌ను ఎదుర్కొనేందుకు 17మంది సభ్యులతో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించారు. అందులో భాగంగానే చిన్నతరహా పరిశ్రమలకు చేయూత నివ్వవనున్నట్లు ఆయన తెలిపారు. ఇంతేకాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల స్థితిగతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఈ కమిటీలో బిలియనీర్స్ వారన్ బఫెట్, గుగూల్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎరిక్‌ష్మీద్ వంటి మరికొంత మంది ప్రముఖులు ఉన్నారు. త్వరలోనే దేశ ఆర్ధిక స్ధితి మొరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.