నేడే జగన్ రోడ్ షో

సాయంత్రం ఐదు గంటలకు కాకినాడలోని మరో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం గౌతమి ఎక్స్ ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరతారు. జగన్ తూర్పు గోదావరి జిల్లాకు మెదటిసారి వస్తుండంతో ఈ యాత్ర రాజకీయ ప్రత్యేకతను సంతరించుకుంది. చిరంజీవి ఖిల్లాగా పేరొందిన ఈ జిల్లాల్లో జగన్ రాజమండ్రి నుంచి కాకినాడ వరకు సుమారు 68 కిలోమీటర్లు పర్యటిస్తారు. పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహిస్తారు.
కాంగ్రెస్ పార్టీ దృష్టి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలపై పడింది. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యువగర్జన విజయవంతమవడం, పశ్చిమ గోదావరి చిరు సొంత జిల్లా కావడంతో వీటి మీద దృష్టి పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముందుగా తూర్పుగోదావరిని టార్గెట్ చేశారు. యువతను ఆకర్షించేందుకు ముఖ్యంత్రి కుమారుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగుతున్నారు. ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు. జగన్ పర్యటను విజయవంతం చేసేందుకు యువజన కాంగ్రెస్ భారీగా కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications