యాక్సెల్ ఇండియా భారీ పెట్టుబడుల వ్యూహం
బెంగళూరు: భారతదేశంలో 60 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి యాక్సెల్ కంపెనీ సిద్ధమైంది. సీడ్, అండ్ ఎర్లీ స్టేజ్ కంపెనీలలో వెంచర్ ఫండ్ పెట్టడానికి యాక్సెల్ సన్నద్ధమైంది. భారతదేశంలో టెక్నాలజీ, టెక్నాలజీ సంబంధింత సర్వీసులు, ఇంటర్నెట్, మొబైల్, మీడియా, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సర్వీసుల రంగాల్లో యాక్సెల్ పెట్టుబడులు పెడుతుంది.
యాక్సెల్ సంస్ధ 1983 లో ప్రారంభమైంది. ఈ సంస్ధ చేతిలో నాలుగు బిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయి. 300 కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఎందరో ఐటి ఆంతపెనార్స్ ను తయారు చేసిన ఘనత ఈ కంపెనీది. కమ్ సోర్స్, ఫేస్ బుక్, జె బాస్, కాయక్, మాక్రో మీడియా వంటి కంపెనీలకు యాక్సెల్ ఫండింగ్ చేసింది. ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వాటి యాజమాన్య బాధ్యతల్లో చేరడం యాక్సెస్ కంపెనీ ప్రాధమిక వ్యాపారం. యాక్సెల్ ఇండియాలో మహేంద్రన్ బాల చంద్రన్, గగన్ కుమార్, సుబ్రతా మిత్రా, ప్రశాంత్ ప్రకాష్ భాగస్వాములుగా ఉన్నారు.
భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని మూలల్లో ఉన్న ప్రతిభావంతులైన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యాక్సెల్ కంపెనీ ఆర్ధిక సహాయం చేస్తోంది. సీడ్ అండ్ ఎర్లీ స్టేజ్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం భారతదేశంలో తక్కువ. మొత్తం వెంచర్ క్యాపిటల్ లో ఈ రంగంలో పెట్టుబడులు ఐదు శాతం మాత్రమే.
" భారతదేశంలో అంత్రపెనార్ కార్యకలాపాల్లో గత కొన్నేళ్ళుగా మంచి అభివృద్ధి ఉంది. చాలా మంది మొదటి తరం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు" అని యాక్సెల్ ఇండియా భాగస్వామి సుబ్రతా మిత్రా చెప్పారు.
యాక్సెల్ ఇండియా గురించి...
భారతదేశంలో సీడ్, ఎర్లీ స్టేజి కంపెనీలకు యాక్సెల్ ఇండియా చేయూతను ఇస్తోంది. భారతదేశంలో ప్రంపంచ శ్రేణి వసతులు కల్పించడం యాక్సెల్ ఇండియా లక్ష్యం. యాక్సెల్ ఇండియా పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీల్లో డవ్ టేయిల్, హాలిడే ఐక్యు, ఇన్ బయో ప్రో, కాతి జోన్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications