సూపర్ టేస్టీ 'టమాటా రైస్'.. నిమిషాల్లోనే లంచ్ బాక్స్ కు రెడీ..!
ఎప్పుడూ ఒకేరకమైన కూరలు తిని బోర్ కొట్టిందా..? అయితే ఎలాంటి కర్రీస్ లేకుండా సూపర్ టేస్టీ టమాటా రైస్ ను తయారు చేసుకోండి. టైమ్ లేనప్పుడు ఈజీగా క్షణాల్లో ఈ టమాటా రైస్ రెడీ అవుతుంది. కాస్త పుల్లగా, కాస్త కారంగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భలే ఇష్టంగా తింటారు. మరి ఈ సూపర్ టేస్టీ టమాటా రైస్ ను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
టమాటా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బియ్యం ఒక కప్పు, టమాటోలు మూడు మధ్యస్థ సైజులో, ఉల్లిపాయ ఒకటి, నూనె రెండు స్పూన్ లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, పోపు గింజలు కొద్దిగా, పచ్చిమిర్చి రెండు, కరివేపాకు కొద్దిగా, పసుపు అర టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా టమాటా రైస్ తయారీకి బియ్యం కడిగి నీరు వంచేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో పోపు గింజలు వేయాలి. అలా పోపు గింజలు వేసిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో తరిగిన టమాటాలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యం, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర చల్లుకుని వడ్డించుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ టమాటా రైస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications