వీలు లేకే బ్యారక్ లో మొద్దు శీను: డిజి
అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడు మొద్దు శీనును విడిగా ఉంచే వసతి లేకనే బ్యారెక్ లో ఉంచినట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ లోకేంద్రశర్మ చెప్పారు. ఆయన గురువారంనాడు అనంతపురం సబ్ జైలును సందర్శించారు. అనంతపురం సబ్ జైల్లో ఖైదీలను విడి విడిగా ఉంచేందుకు సెల్స్ లేవని, బ్యారెక్ లు మాత్రమే ఉన్నాయని, అందుకే మొద్దు శీనును బ్యారెక్ లో ఉంచాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
నిజానికి ఇది జైలు కోసం నిర్మించిన భవనం కాదని, బోస్టన్ స్కూలును జైలుగా వాడుతున్నామని, ఇది జైలుకు అనువైంది కాదని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులోని నిందితులను విచారణ నిమిత్తం ఈ జైలుకు తీసుకొచ్చారని, వారిని విడి విడి బ్యారక్స్ లో ఉంచారని ఆయన అన్నారు. తనను విడిగా ఉంచాలని మొద్దు శీను పలు మార్లు వినతి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications