కౌలాలంపూర్ : ప్రపంచంలో అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేష్ అంబానీకి స్థానం దక్కింది. ఆయన ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. లక్ష్మీ మిట్టల్ 20.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. అనిల్ అంబానీ 12.5 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో, సునిల్ మిట్టల్ 7.9 బిలియన్ డాలర్లు, కె.పిసింగ్ 7.8 బిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
స్టాక్ మార్కెట్ బలహీన పడడం వల్ల, రూపాయి విలువ తగ్గడం వల్ల 40 మంది భారతీయ సంపన్నుల ఆస్తుల విలువ 60 శాతం తగ్గిందని ఆ పత్రిక తెలియజేసింది. భారతీయ బడా పారిశ్రామికవేత్తలకు ఇది చెడు కాలమని ఫోర్బ్స్ ఆసియా వ్యాఖ్యానించింది.