నీ ఊరికేం చేశావు: చిరుకు వైయస్ ప్రశ్న

YS Rajasekhar Reddy
గుంటూరు: ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన పల్లెబాట పేరుతో గుంటూరు జిల్లాలో గురువారం పర్యటించారు. 30 ఏళ్లపాటు సినీ జీవితంలో కోట్లాది రూపాయలు ఆర్జించి సొంత గ్రామాన్నే సందర్శించని చిరంజీవి రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్ల ప్రజల సమస్యలు ఏం తీరుస్తారని ఆయన అడిగారు.

చిరంజీవి తెచ్చే మార్పు ఏమిటని ఆయన అడిగారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఆపుతారా, ఏడున్నర లక్షల మందికి పెన్షన్లు అపుతారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా అపుతారా, స్త్రీలకు ఇచ్చే పావలా వడ్డీకే రుణాలను ఆపుతారా అని ఆయన అడిగారు. రాష్ట్రాభివృద్ధిలో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెసుకు ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. గుంటూరు జిల్లా పర్యటనలో తొలుత తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తిన ఆయన తదనంతరం చిరంజీవిపై ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+