కాంగ్రెసులో పందికొక్కులు లేవు: వైయస్

YS Rajasekhar Reddy
గుంటూరు: తాము ఇచ్చిన మాటను తప్ప లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా గుంటూరు జిల్లా రెంటచింతలలో జరిగిన బహిరంగ సభలో ఆయన గురువారంనాడు ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు. రైతు కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా ఆ పార్టీ కార్యకర్తలు పందికొక్కుల్లా తినేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీలో పందికొక్కులు లేవని ఆయన అన్నారు.

పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. తాము అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం వంటి సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. పల్నాటి సీమ కాంగ్రెసుకు అండగా ఉంటోందని ఆయన చెప్పారు. మరింత అభివృద్ధి చేయడానికి, మరింత సంక్షేమాన్ని అమలు చేయడానికి తమను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+