కాకినాడ-ఉప్పాడ మధ్య సముద్రం పోటు
కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఉగ్రరూపం దాలుస్తోంది. తీరం దాటకుండానే తీర ప్రాంత ప్రజలను వణికిస్తోంది. కాకినాడ-ఉప్పాడ మధ్య పోటెత్తుతున్న సముద్రం ప్రళయాన్ని తలపిస్తున్నది. ఆకాశాన్ని తాకుతున్న అలలు, ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు, కోసుకుపోతున్న తీర ప్రాంతం మరో సునామీ ఉత్పాతాన్ని గుర్తుకు తెస్తున్నది.
కాకినాడ-యానాం మధ్య తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉండడంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వాహనాలను పిఠాపురం మీదుగా దారి మళ్ళిస్తున్నారు. కెరాటాలు ఎనిమిది అడుగుల ఎత్తున ఎగసి పడుతూ, సముద్రం ఇంత అల్లకల్లోలంగా ఉండడం తాము ఎప్పు డూ చూడలేదని మత్స్యకారులు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతున్నది.












Click it and Unblock the Notifications